News March 21, 2025

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 58,872 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా..23,523 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.

Similar News

News November 23, 2025

వికారాబాద్: మార్వాడీల మాయాజాలం.. బంగారంతో మాయం.!

image

మార్వాడీల మాయాజాలం ప్రజల బంగారంతో మాయమైపోతున్నారు. స్థానిక నాయకుల అందండలతో మార్వాడీ వ్యాపారస్తులు తాకట్టు పెట్టిన బంగారం తీసుకొని పారిపోతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కుల్కచర్ల మండలంలో ఇప్పటివరకు మార్వాడీలు ప్రజలను నమ్మించి బంగారంతో ఉడాయించారు. మార్వాడీలు ప్రజలను తరుచూ మోసం చేసి పారిపోతున్నారన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అండగా ఉండటంతో మార్వాడీలు దోచుకుంటున్నారన్నారు.

News November 23, 2025

భారీ జీతంతో 115 ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA ఉత్తీర్ణత, వయసు 22-45 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

News November 23, 2025

మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉందా?

image

AP: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌ కీలక ప్రకటన చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం కొత్తగా IFSC కోడ్ UBIN0CG7999ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. దీనిద్వారానే NEFT/RTGS/IMPS/UPI సేవలను కొనసాగించుకోవచ్చని తెలిపింది. కాగా ఈ ఏడాది మే 1 నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించిన విషయం తెలిసిందే.