News May 14, 2024
RCBని కాపాడేది ‘18’ ఒక్కటే
వరుస గెలుపులతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక మ్యాచ్ ఆడనుంది. అయితే, ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే జెర్సీ నెం.18 కలిగిన కోహ్లీ టీమ్ ఈనెల 18న చెన్నైపై 18 పరుగుల తేడాతో గెలుపొందాలి. లేదా 18.1 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించాల్సి ఉంది. దీంతో ఆర్సీబీని కాపాడేది ‘18’ నంబర్ ఒక్కటే అంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
Similar News
News January 10, 2025
ఈ మేక ఖరీదు రూ.13.7 లక్షలు
ఏంటీ ధర చూసి అవాక్కయ్యారా? ఇది మామూలు మేక కాదు మరి. అసాధారణమైన పొడవాటి చెవులు వంటి ప్రత్యేక లక్షణాలకు ఈ మేక ప్రసిద్ధి చెందింది. దీని విక్రయం కోసం సౌదీ అరేబియాలో ప్రత్యేకంగా వేలం నిర్వహించగా ఔత్సాహికులు ఆకర్షితులై పోటీపడ్డారు. వేలంలో ఓ సౌదీ వ్యక్తి దీనిని 60,000 సౌదీ రియాల్స్‌కు(రూ.13.74 లక్షలు) కొనుగోలు చేశారు. దీంతో మేకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
News January 10, 2025
టెస్టు జెర్సీతో జడేజా పోస్టు.. రిటైర్మెంట్‌పై చర్చలు
IND ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇన్‌స్టాలో తన ఎనిమిదో నంబర్ టెస్టు జెర్సీ ఫొటోను షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన అతను టెస్టులకూ గుడ్ బై చెప్పే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అతను టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. కాగా జడేజా 80 టెస్టుల్లో 3,370 రన్స్ చేసి, 323 వికెట్లు పడగొట్టారు.
News January 10, 2025
శీతాకాలంలో బాదం ప్రయోజనాలెన్నో
శీతాకాలంలో తరచూ అనారోగ్యాలు దాడి చేస్తుంటాయి. వాటి నుంచి రక్షణ కలిగేలా రోగనిరోధక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు బాదం గింజలు ఉపకరిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ‘బాదంలో విటమిన్-ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, రిబోఫ్లావిన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. బరువు నియంత్రణకు, శరీరం వెచ్చగా ఉండేందుకు ఇవి మేలు చేస్తాయి. బాదం గింజల్ని రోజూ తినడం మంచిది’ అని పేర్కొంటున్నారు.