News October 15, 2025
ICAR-IARIలో 18 ఉద్యోగాలు..

ICAR-IARI(ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) 18 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో యంగ్ ప్రొఫెషనల్(15), సీనియర్ రీసెర్చ్ ఫెలో(3) ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31లోగా అప్లై చేసుకోవాలి. నవంబర్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iari.res.in/
Similar News
News October 15, 2025
₹13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

AP: PM మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ₹13వేల కోట్ల పనులలో కొన్నింటిని పీఎం ప్రారంభిస్తారని, మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారని CM CBN తెలిపారు. ‘గత పాలకుల తప్పిదాలతో రాష్ట్రం చాలా నష్టపోయింది. వాటిని సరిదిద్దేందుకే చాలా టైం పట్టింది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులొస్తున్నాయి. కూటమితో APని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దుదాం. PM సభను విజయవంతం చేయాలి’ అని కోరారు.
News October 15, 2025
హిందీ మూవీస్ బ్యాన్‌కు TN ప్రభుత్వం బిల్లు!

తమిళనాడులో హిందీ ఇంపోజిషన్‌ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా హిందీ మూవీస్, సాంగ్స్, హోర్డింగ్స్‌ను బ్యాన్ చేసేందుకు ఇవాళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ విషయంలో చట్టపరమైన సవాళ్లపై నిన్న రాత్రి సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా ఇది మూర్ఖత్వమని బీజేపీ నేత వినోజ్ సెల్వమ్ మండిపడ్డారు.
News October 15, 2025
ప్రముఖ సింగర్ బాలసరస్వతి కన్నుమూత

తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి(97) తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1928లో జన్మించిన ఆమె ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ‘సతీ అనసూయ’ చిత్రంలో తొలి పాట పాడారు. ఆరేళ్ల వయసు నుంచే పాడటం మొదలెట్టిన బాలసరస్వతి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 2 వేలకు పైగా పాటలు ఆలపించారు. పలు సినిమాల్లో నటించారు.