News April 19, 2024

ఒక్క ఓటు కోసం.. కారడవిలో 18 కి.మీ నడక!

image

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు. కానీ ఓటు వేయాలనుకున్నారు. ఇంటి నుంచే ఓటేసేందుకు అనుమతి పొందారు. దీంతో అడవి జంతువులు, రాళ్లూరప్పలతో కూడిన కారడవిలో 18 కిలోమీటర్లు నడిచి వెళ్లిన 9మంది అధికారులు ఆయనతో ఓటు వేయించారు. ఓటేసిన శివలింగం సంతోషంతో కన్నీటిపర్యంతం కావడం గమనార్హం. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక్క ఓటైనా కీలకమే!

Similar News

News February 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 11, 2026

సామాజిక కార్యకర్తలకు సన్మానం చేసిన అర్జున్

image

నటుడు అర్జున్ ‘సీతాపయనం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తన గొప్ప మనసు చాటుకున్నారు. ముగ్గురు సామాజిక కార్యకర్తలను ఆయన వేదికపై సన్మానించారు. ట్యాంక్ బండ్ శివ, ప్రకృతి ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణ, వైద్యులు, సంఘ సేవకులు ప్రకాశ్ ఆమ్టే దంపతులకు రూ.లక్ష చొప్పున అందజేశారు. అర్జున్ దర్శకత్వం వహించిన ‘సీతాపయనం’లో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది.

News February 11, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 11, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.16 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.