News February 16, 2025
గజిబిజి అనౌన్స్మెంట్కు 18 మంది బలి!

నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్మెంట్ కారణమని తెలుస్తోంది. 12వ ప్లాట్ఫామ్ నుంచి 16వ ప్లాట్ఫామ్కు రైలు వస్తుందని అకస్మాత్తుగా ప్రకటించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. రైళ్ల ఆలస్యం, రద్దు వదంతులతోనూ తోపులాట జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రైల్వే నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వస్తున్నాయి.
Similar News
News October 29, 2025
CM చంద్రబాబు ఏరియల్ సర్వే

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి ఆయన హెలికాప్టర్లో బయల్దేరారు. వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై ఉదయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమీక్ష కూడా నిర్వహించారు.
News October 29, 2025
మొంథా తుఫాను – మొక్కజొన్నలో జాగ్రత్తలు

పొలంలో నిల్వ ఉన్న నీటిని 24-48 గంటలలోపు తొలగించాలి. పొలాలు ఎండిన తర్వాత లీటరు నీటికి 10గ్రా. యూరియా+5గ్రా. జింక్ సల్ఫేట్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. కోతకు దగ్గరలో ఉన్న మొక్కజొన్న పొత్తులను వెంటనే కోసి వాటిని 12-13% తేమ స్థాయికి ఆరబెడితే మొలకెత్తదు, నాణ్యత తగ్గదు. కండె కుళ్ళు, ఆకుమచ్చ ఇతర శిలీంద్ర తెగుళ్ల నివారణకు లీటరు నీటికి ప్రాపికొనజోల్ 1ml లేదా మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News October 29, 2025
తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన ‘మొంథా’

AP: మొంథా తుఫాను శాంతించింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడి AP, TG, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఐదు రోజుల్లోగా పంటనష్టం అంచనా వేయాలని ఆదేశించామన్నారు.


