News August 21, 2024

18 మంది మృతి కలచివేసింది: పవన్ కళ్యాణ్

image

AP: అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 18 మంది మృతి తనను కలచివేసిందని అన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు. మరోవైపు ఘటనపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉండి, క్షతగాత్రులకు వైద్యం అందించాలని ఆదేశించారు.

Similar News

News July 10, 2025

బుమ్రా, ఆర్చర్.. అంచనాలు అందుకుంటారా?

image

ఇవాళ భారత్- ఇంగ్లండ్ లార్డ్స్‌లో మూడో టెస్టులో తలపడనున్నాయి. అక్కడ పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే ఛాన్స్ ఉంది. అందుకే బుమ్రా, ఆర్చర్‌పై ప్లేయర్లే కాదు.. అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బుమ్రా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకుని మళ్లీ బరిలోకి దిగుతున్నారు. వీళ్లు రాణిస్తే బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. అయితే, ఎంత మేరకు అంచనాలు అందుకుంటారో చూడాలి.

News July 10, 2025

నేడు మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0

image

AP: ప్రభుత్వం మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజు 2 కోట్ల మందితో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనుంది. 74,96,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్స్, 1,49,92,456 మంది పేరెంట్స్, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. మొత్తం 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పుట్టపర్తి కొత్తచెరువు ZP స్కూల్లో కార్యక్రమానికి CM చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు.

News July 10, 2025

విశాఖలో CII పార్టనర్షిప్ సమ్మిట్

image

AP: నవంబరు 14,15 తేదీల్లో విశాఖలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ జరగనుంది. సదస్సు సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంలో CS విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. రిజిస్ట్రేషన్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఆన్‌లైన్ చేయాలన్నారు. సదస్సును సక్సెస్ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్‌ను ఆదేశించారు.