News August 8, 2025
లైంగిక సమ్మతికి 18 ఏళ్లు తప్పనిసరి: కేంద్రం

లైంగిక సమ్మతికి వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కేంద్రం స్పందించింది. ‘లైంగిక సమ్మతికి 18 ఏళ్లు దాటాల్సిందే. మైనార్టీ తీరని వారిని లైంగిక మోసాల నుంచి కాపాడేందుకు బాగా ఆలోచించి ఈ విధానం అమలు చేస్తున్నాం. యువతీ యువకుల మధ్య శృంగార భరిత ప్రేమ పేరుతో ఈ పరిమితిని తగ్గించడం ప్రమాదకరం. తగ్గిస్తే పిల్లల అక్రమ రవాణా, బాలలపై నేరాలు పెరుగుతాయి’ అని అభిప్రాయపడింది.
Similar News
News August 8, 2025
ఒకే ఇంట్లో 250 మంది ఓటర్లు.. EC క్లారిటీ ఇవ్వాలన్న జర్నలిస్టు

బిహార్ ముజఫర్‌పూర్‌లోని భగవాన్‌పూర్‌లో ఒకే ఇంటి నంబర్‌పై 250 మంది ఓటర్లు ఉన్నట్లు SIR డ్రాఫ్ట్‌లో కనిపిస్తుందని జర్నలిస్టు అజిత్ అంజుమ్ అన్నారు. ఇదెలా సాధ్యమో చెప్పాలని ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించారు. అది కూడా వివిధ కులాల ఓటర్లు ఉన్నారని, వీరికి 300 మంది పిల్లలు ఉంటే అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్టే కదా అన్నారు. ఇది ఇల్లా లేక గ్రామమా అనే క్లారిటీ ఇవ్వాలని X వేదికగా కోరారు.
News August 8, 2025
ఛాన్స్ రాకపోవడంతో బాధపడ్డ అభిమన్యు!

టెస్టు సిరీస్ కోసం ENG వెళ్లినా భారత తుది జట్టులో చోటు దక్కకపోవడంపై అభిమన్యు ఈశ్వరన్ ఎంతో బాధపడ్డారని అతడి తండ్రి రంగనాథన్ తెలిపారు. ‘నేను ఫోన్ చేసినప్పుడు తనకు ఇంకా తుది జట్టులో చోటు దక్కలేదని వాపోయాడు. కానీ ఇది తన 23 ఏళ్ల కల అని, 1-2 ఆటలకు ఎంపిక కాకపోవడం వల్ల అది చెదిరిపోదని ధీమా వ్యక్తం చేశాడు. తప్పకుండా ఛాన్స్ లభిస్తుందని కోచ్ గంభీర్ కూడా హామీ ఇచ్చారు’ అని రంగనాథన్ చెప్పుకొచ్చారు.
News August 8, 2025
పాము కాటేస్తే వెంటనే ఇలా చేయండి..

వర్షాకాలంలో విష సర్పాలు జనావాసాల్లో సంచరిస్తుంటాయి. ఈక్రమంలో పాము కాట్లు జరిగే అవకాశం ఉండటంతో కేంద్రం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ‘పాము కాటేస్తే గాభరా పడకండి. ప్రభావిత ప్రాంతంలో బిగుతుగా ఉండే దుస్తులను తీసేయండి. కాటేసిన చోటు నుంచి కాస్తపై భాగంలో గుడ్డతో కట్టండి. కానీ రక్తప్రసరణ ఆగిపోకుండా చూసుకోండి. కాటు గాయాన్ని కోయడం లేదా పీల్చడం చేయవద్దు. వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లండి’ అని తెలిపింది.