News March 17, 2024

180 సెలవులు ఎప్పుడైనా వాడుకోవచ్చు: ప్రభుత్వం

image

AP: మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ సెలవులపై విధించిన నిబంధనను ప్రభుత్వం తొలగించింది. వారు తమ పిల్లల వయసు 18 ఏళ్లు వచ్చేలోపే ఈ సెలవులు వినియోగించుకోవాలని గతంలో నిబంధన ఉంది. తాజాగా దీన్ని ఎత్తేసిన ప్రభుత్వం.. రిటైరయ్యేలోపు ఎప్పుడైనా 180 రోజుల సెలవులు వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అసెంబ్లీ ఉద్యోగులకు సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.

Similar News

News September 8, 2025

టిక్ టాక్‌పై బ్యాన్ ఎత్తివేయం: కేంద్ర మంత్రి

image

టిక్ టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేసే ఆలోచన లేదని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆ యాప్‌ను మళ్లీ పునరుద్ధరించే ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వంలో కూడా ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కాగా భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో టిక్ టాక్ యాప్ మళ్లీ ఇండియాలోకి వస్తుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి ఈ విధంగా స్పందించారు.

News September 8, 2025

నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు: కాజల్

image

తనకు యాక్సిడెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఫన్నీగా ఉంటాయని తెలిపారు. దేవుడి దయతో తాను ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నానని చెప్పారు. తప్పుడు ప్రచారాలపై ఫోకస్ చేయకుండా నిజాలపై దృష్టి పెట్టాలని కోరారు. కాగా రోడ్డు ప్రమాదంలో కాజల్‌కు తీవ్రగాయాలు అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

News September 8, 2025

రేపటి నుంచే ఆసియా కప్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

image

రేపటి నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది. గ్రూప్-Aలో భారత్, పాక్, UAE, ఒమన్, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లా, అఫ్గాన్, హాంకాంగ్ తలపడతాయి. దుబాయ్, అబుదాబి వేదికల్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ 1, 3, 4, 5, సోని లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. గ్రూపు దశలో భారత్‌ 10, 14, 19 తేదీల్లో మ్యాచులు ఆడనుంది.