News August 8, 2024
1,800 గ్రాముల బంగారంతో అన్నవరం ధ్వజస్తంభం

అన్నవరం దేవస్థానం అనివేటి మండపంలో ధ్వజస్తంభానికి బంగారు తాపడం పనులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఈ పనులు నెల్లూరుకు చెందిన దాత సహకారంతో చేపడుతున్నారు. రాగి రేకుకు బంగారు తాపడం చేసి ధ్వజస్తంభానికి అమర్చనున్నారు. సుమారు 300 కిలోల రాగిపై 1,800 గ్రాముల బంగారంతో పనులు చేపట్టారు.
Similar News
News November 25, 2025
24 గంటల్లో ధాన్యం చెల్లింపులు తప్పనిసరి: మంత్రి నాదెండ్ల

రాజమండ్రి కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోపు రైతులకు చెల్లింపులు చేయాలని మంత్రి మనోహర్ ఆదేశించారు. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ పనితీరు మెరుగుపడాలని సూచించారు.

News November 24, 2025
టెన్త్ పరీక్షలపై సందేహాలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్: DEO

2026 మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్‌ను ప్రధానోపాధ్యాయులు నిశితంగా పరిశీలించాలని డీఈవో కంది వాసుదేవరావు సూచించారు. పాఠశాల యూ-డైస్ డేటాతో సరిచూసుకుని, దోషరహితంగా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తి కోసం జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, అసిస్టెంట్ కమిషనర్ ఎం.అమలకుమారిని 9849939487 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.