News August 5, 2024
రైతుల ఆదాయం పెంచేందుకు రూ.18000 కోట్లు

రాబోయే ఐదేళ్లలో రూ.18వేల కోట్లతో 100 ఎగుమతి ఆధారిత హార్టికల్చర్ క్లస్టర్లను నెలకొల్పుతామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ ప్రకటించారు. అలాగే వంటనూనె దిగుమతులు తగ్గించేందుకు ఆయిల్ సీడ్ మిషన్‌కు రూ.6800 కోట్లను కేటాయిస్తామని రాజ్యసభలో తెలిపారు. వీటితో రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. కాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులపై కాల్పులు జరిపిన సంఘటనలు ఉన్నాయని, అది రైతు వ్యతిరేకి అని విమర్శించారు.
Similar News
News November 14, 2025
సెంచరీకి 5 ఓటముల దూరంలో రాహుల్: బీజేపీ సెటైర్లు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలపడటంపై BJP సెటైర్లు వేసింది. ఎన్నికల ఓటములకు చిహ్నంగా రాహుల్ మారారని విమర్శించింది. 2004 నుంచి ఇప్పటిదాకా 95 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని ఓ మ్యాప్‌ను షేర్ చేసింది. సెంచరీకి 5 ఓటముల దూరంలో ఉన్నారని ఎద్దేవా చేసింది. ‘మరో ఎన్నిక, మరో ఓటమి! ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే.. మొత్తం రాహుల్‌కే వస్తాయి’ అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
News November 14, 2025
NHIDCLలో ఉద్యోగాలు

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(NHIDCL) 6 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్స్ మెయిన్స్- 2024 రాసి ఇంటర్వ్యూకు ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34 ఏళ్లు. సివిల్స్ మెయిన్స్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nhidcl.com/
News November 14, 2025
జూబ్లీ బలం: ఈ నెలలోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం కాంగ్రెస్‌కు, ప్రభుత్వానికి ఊపు ఇచ్చింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికలకు GOVT సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 42% BC రిజర్వేషన్లకు లీగల్ సమస్యలుండడంతో మొత్తం 50% లోపే అవి ఉండేలా అధికారులు మరో నివేదికను ఇప్పటికే రెడీ చేశారు. దీనిపై BCల నుంచి వ్యతిరేకత రాకుండా ఆ నేతలకు వివరించాలని మంత్రులకు CM సూచించినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ నెలాఖరులో రావచ్చని భావిస్తున్నారు.


