News June 4, 2024
1,84,442 ఓట్ల ఆధిక్యంలో బలరాం నాయక్

మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ 1,84,442 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితకు 1,43,318 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌కు 3,27,760 వచ్చాయి. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాసేపట్లో మహబూబాబాద్ చివరి ఫలితం విడుదల కానుంది.
Similar News
News October 15, 2025
ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లు: వరంగల్ కలెక్టర్

రైతులు పండించిన ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వెల్లడించారు. బుధవారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
News October 15, 2025
గౌరీ కేదారేశ్వర నోములు 21నే: ప్రధానార్చకుడు

పరమపవిత్రమైన గౌరీ కేదారీశ్వర నోములను ఈనెల 21 మంగళవారం రోజున ఆచరించాలని భద్రకాళి దేవస్థానం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. ఈనెల 20న నరక చతుర్దశి సందర్భంగా సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి, హారతులు తీసుకోవాలన్నారు. సూర్యోదయానికి ముందు తైలం రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్పారు.
News October 15, 2025
రేపు ములుగు రోడ్డులో జాబ్ మేళా..!

నిరుద్యోగ యువతీయువకులకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి సాత్విక తెలిపారు. ఆల్ మార్క్ ఫైనాన్సియల్ సర్వీసెస్లో రికవరీ ఏజెంట్, టెలీకాలర్ ఉద్యోగాల కోసం మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగలవారు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ములుగు రోడ్డులోని ఐటీఐ ప్రాంగణంలో గల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జరగనున్న జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.