News June 4, 2024

18,498 ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య

image

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 2వ రౌండ్ పూర్తయ్యే సరికి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు 61,611 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌కు 43,113, బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ 28,195 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 18,498 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News December 1, 2024

ద్వైపాక్షిక సంబంధాల పట్ల టర్కీ ఆసక్తి:మంత్రి శ్రీధర్ బాబు

image

తెలంగాణాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నట్లు టర్కీ రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడించారు. సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఆయన భేటీ అయ్యారు. పరస్పర సహకారంపై అరగంట సేపు వారు చర్చించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైందని టర్కీ పారిశ్రామిక బృందాన్ని పంపించి ఇక్కడి ఎకోసిస్టంను వారు పరిశీలించేలా చొరవ తీసుకోవాలన్నారు.

News December 1, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> BHPL: అనుమానస్పదంగా మృతి చెందిన ఏఎన్ఎం
> WGL: రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
> BHPL: తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు
> WGL: అన్నారం షరీఫ్ లో వ్యక్తి మృతి
> BHPL: బావ అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా బామ్మర్ది మృతి
> HNK: తిరుమలలో గుండెపోటుతో జిల్లా వాసి మృతి
> MHBD: జవాన్ సతీష్ అంతిమయాత్ర
> JN: జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్

News November 30, 2024

WGL: పదేళ్లలో BRS అప్పులు చేసి భారం మోపింది: సీతక్క

image

గత BRSప్రభుత్వం అప్పులు చేసి భారం మోపిందని, అయినా సరే రైతుల సంక్షేమం కోసం రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డ అయిన CMరేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నారని, రైతుల సంక్షేమానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. BRSనేతలు రైతులను రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.