News July 3, 2024

18,526 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

image

AP: కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరకు పట్టుకున్న 15,396 టన్నుల(రూ.43.43 కోట్ల) రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనం. కాగా కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ మాఫియా అవినీతికి పాల్పడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీటిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News March 31, 2026

ఆ దేశాలకు ట్రంప్ ఆప్షన్లు

image

హార్ముజ్‌లో నౌకల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని గతంలో పలు దేశాలకు హామీ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మాట మార్చారు. ‘యుద్ధంలో పాల్గొనని UK లాంటి దేశాలకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. మా దేశం నుంచి ఇంధనం కొనాలి. లేదంటే ధైర్యం తెచ్చుకొని సొంతంగా హార్ముజ్‌ నుంచి చమురు తెచ్చుకోవాలి. మీ కోసం మీరే పోరాడటం నేర్చుకోండి. అమెరికా మీకే సాయం చేయదు’ అని SMలో పోస్టు చేశారు.

News March 31, 2026

మొబైల్ డేటాను తెగ వాడేస్తున్నారు

image

గతేడాది దేశంలో ఒక్కో వ్యక్తి నెలవారీ సగటు మొబైల్ డేటా వినియోగం 31GBగా(2024లో 27.5GB) ఉందని నోకియా నివేదిక వెల్లడించింది. టోటల్ మంత్లీ డేటా వాడకం 27 ఎక్సాబైట్లు(ఒక ఎక్సాబైట్=100 కోట్ల GB) దాటిందని తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌లో 5G వాటా 47%గా ఉందంది. AI అప్లికేషన్స్, 4K వీడియోల స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ కారణంగా డేటా వాడకం పెరిగిందని పేర్కొంది.
* మీరు డేటాను ఎక్కువగా దేనికోసం వాడుతున్నారు?

News March 31, 2026

అప్పటి నుంచి ధోనీతో మాట్లాడలేదు: జడేజా

image

CSK నుంచి రాజస్థాన్ జట్టులోకి ఛేంజ్ అయినప్పటి నుంచి ధోనీతో మాట్లాడలేదని జడేజా తెలిపారు. ‘ధోనీ ఫోన్ ఎప్పుడూ స్విచ్ఛాఫ్ చేసి ఉంచుతారు. అందుకే మాట్లాడలేదు’ అని నవ్వేశారు. నిన్న కలిసే అవకాశం రాలేదని, ఈసారి మీట్ అయినప్పుడు అన్ని విషయాలు చర్చించుకుంటామన్నారు. ఇక నిన్న మ్యాచ్ అనంతరం ఖలీల్ ధరించిన CSK జెర్సీని జడేజా కిస్ చేశారు. గత సీజన్ వరకు CSK జట్టులో జడ్డూ కీలక ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే.