News April 7, 2025

18,799 ఉద్యోగాలు.. UPDATE

image

RRB అసిస్టెంట్ లోకో పైలట్ కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్-2 మే 2, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉ.7.30, మ.12.30 గంటలకు రెండు షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 19, 20 తేదీల్లోనే ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Similar News

News October 29, 2025

‘తులసి బాసో’ వరి రకం ప్రత్యేకతలు ఇవే

image

తులసి బాసో ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దేశీయ వరి రకం. దీనిలో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఖరీఫ్‌కి మాత్రమే అనువైన రకం. 135 రోజుల తర్వాత ఎకరాకు 15-18 క్వింటాళ్లు, రెండవ కోతకు 6-8 క్వింటాళ్లు, మూడో కోతకు 5-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొదటి కోతకి మూడో కోతకు గింజ పరిమాణం, సువాసన ఏమాత్రం తగ్గదు. ఎంతటి గాలులనైనా తట్టుకొని పంట ఒరగదు. రైతు ఫోన్ నెంబరు 6300027502, 9440809364.

News October 29, 2025

Swiggy & Zomato: ఒక్కో ఆర్డర్‌పై రూ.100 ఫీజు?

image

జొమాటో, స్విగ్గీ వినియోగదారులకు భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ.100 -150 వరకు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్లాట్‌ఫామ్ ఫీజు, ప్యాకేజింగ్ ఛార్జెస్, రెయిన్ ఫీజు, అలాగే వీటిపై GSTని వసూలు చేస్తున్నాయి. వీటికి బదులు ఇకపై ఒకే ఛార్జ్‌ను వసూలు చేస్తాయని వార్తలొస్తున్నాయి. దీనిపై సంస్థలు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

News October 29, 2025

దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

image

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్‌రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.