News May 12, 2024
1,896 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 1,896 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో వెబ్ క్యాస్టింగ్ చేపట్టనుండగా, 621 పోలింగ్ కేంద్రాల బయట వైపు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 103 లోకేషన్లలో 230 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే, వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవలకు సంబంధించిన వారు 2,728మంది, ఉద్యోగులు 8,199మంది ఓట్లు వేశారన్నారు.
Similar News
News February 13, 2025
BREAKING: 19 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రి: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ప్రకటించారు. లొంగిపోయి సాధారణ జీవితం గడపటానికి వారు ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ పాల్గొన్నారు.
News February 13, 2025
మున్సిపాలిటీలకు టెన్షన్‌గా పన్ను వసూళ్లు

ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు పన్ను వసూళ్లు టెన్షన్‌గా మారింది. ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మధిర మున్సిపాలిటీల్లో 50% పైగా ఆస్తి పన్నులు వసూళ్లయ్యాయి. వైరా మున్సిపాలిటీలో కేవలం 27 శాతమే వసూళ్లయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్షలో లక్ష్యానికి దూరంగా మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశించినట్టు సమాచారం.
News February 13, 2025
కూసుమంచి: కల్లులో పురుగు మందు కలిపాడు..!

కల్లు అమ్మకంలో వచ్చిన విభేదాలతో ఓ గీత కార్మికుడు మరోగీత కార్మికుడి కల్లుకుండలో పురుగు మందు కలిపిన ఘటన కూసుమంచి మండలంలో వెలుగు చూసింది. మొక్క వీరబాబుకు ఐతగాని రమేష్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. దీనిని మనసులో పెట్టుకున్న రమేష్, వీరబాబుకి చెందిన కల్లు కుండలో విషం కలిపాడు. చెట్టు ఎక్కగా వాసన రావడంతో అనుమానం వచ్చిన వీరబాబు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించగా రమేష్ అంగీకరించడంతో కేసు నమోదు చేశారు.