News June 24, 2024

18వ లోక్‌సభ విశేషాలివే..

image

నేడు ప్రారంభమయ్యే 18వ లోక్‌సభ సమావేశాల్లో సగానికిపైగా కొత్త ఎంపీలు పాల్గొనబోతున్నారు. మొత్తం సభ్యుల్లో దాదాపు 52% అంటే 280 మంది కొత్తవారు ఎంపీలుగా సభలో అడుగుపెట్టనున్నారు. మిగిలిన వారిలో 216 మంది ఎంపీలు గత సభలో ఉన్నవారు కాగా మరికొందరు అంతకుముందు సభ్యులుగా ఎన్నికైనవారు. మొత్తం 41 పార్టీల నుంచి ఎంపీలున్నారు. సంఖ్యాపరంగా బీజేపీ(240), కాంగ్రెస్(99), సమాజ్ వాదీ పార్టీ(37) టాప్‌-3లో ఉన్నాయి.

Similar News

News January 10, 2025

ఇవాళ వైకుంఠ ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు!

image

పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం ఆచరించి, పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానాన్ని ముట్టరాదు. శారీరక సంబంధాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. పగలు నిద్ర పోరాదు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ చేయాలి. తులసి అంటే విష్ణువుకు మహాప్రీతి. ఇవాళ తులసి ఆకులను కోయొద్దు. ఇతరులను బాధపెట్టేలా విమర్శలు, కఠిన మాటలు మాట్లాడొద్దు.

News January 10, 2025

నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో నిర్మాణ రంగం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం ప్రసంగించనున్నారు. ఉదయం 11గంటలకు చంద్రబాబు గుంటూరు వస్తారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

News January 10, 2025

రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పబ్లిక్ టాక్

image

‘గేమ్ ఛేంజర్’ బెన్‌ఫిట్ షోల సందడి మొదలైంది. మూవీ చూసినవారు IASగా చెర్రీ లుక్, యాక్టింగ్‌ అదిరిపోయాయని చెబుతున్నారు. ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్ సెకండాఫ్‌పై మరింత హైప్ పెంచుతుందట. కమెడియన్లందరూ ఉన్నా కామెడీ లేకపోవడం మైనస్ అంటున్నారు. తమన్ BGM, SJ సూర్య, కియారా, అంజలి నటన బాగుందని చెబుతున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.