News April 18, 2024
19న ఆలూరుకు రానున్న చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 19న టీడీపీ అధినేత చంద్రబాబు ఆలూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసేందుకు బుధవారం ఆలూరులో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అదే రోజు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆలూరులో పర్యటించునున్నారు.
Similar News
News November 17, 2025
సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రి టీజీ

పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలులోని జగన్నాథగుట్ట ఎన్టీఆర్ కాలనీలో సోమవారం 187 టిడ్కో గృహాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కర్నూలులో 10 వేల టిడ్కో ఇళ్ల పూర్తికి రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తొలి దశలో 187 గృహాలు అందించగా, మార్చి 31 నాటికి మొత్తం ఇళ్ల పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు.

రీ-ఓపెన్ అర్జీదారులతో కలెక్టర్ సంభాషణ

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన రీ-ఓపెన్ అర్జీలపై కర్నూలు కలెక్టర్ డా. ఎ. సిరి సోమవారం స్వయంగా అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అర్జీల పరిశీలన, ఎండార్స్‌మెంట్ల అందజేత, భూమి సంబంధించిన అంశాలలో ఫీల్డ్ విజిట్ జరిగిందా అనే విషయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.