News April 18, 2024
19న ఆలూరుకు రానున్న చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 19న టీడీపీ అధినేత చంద్రబాబు ఆలూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసేందుకు బుధవారం ఆలూరులో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అదే రోజు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆలూరులో పర్యటించునున్నారు.
Similar News
News September 17, 2024
ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం
ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణి పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో (శివమ్మ ఆసుపత్రి)లో చేరారు. డా.హనీషా, డా.యశ్వంత్ రెడ్డితో కూడిన వైద్యుల బృందం ఆమెకు నార్మల్ డెలివరీ ద్వారా కాన్పు చేయగా ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
News September 17, 2024
గోనెగండ్ల వద్ద విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
కర్నూలు జల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పల గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చాకలి తిక్కన్న (35) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. తిక్కన్న ఇంటి సమీపంలోని మేకల షెడ్డులో విద్యుత్ వైర్లను సరి చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు తిక్కన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 17, 2024
రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టుకు మూడో స్థానం
ఈనెల 14-15వ తేదీ వరకు భీమిలిలో జరిగిన 49వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో 149 పాయింట్లతో కర్నూలు జిల్లా జట్టు మూడో స్థానం సాధించినట్లు రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24-27వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే 49వ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు.