News August 18, 2024
19న తిరుమలలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీన శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది.
Similar News
News November 4, 2025
సోమల: ముళ్ల పొదలలో నవజాత శిశువు

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ముళ్ల పోదలలో గుర్తు తెలియని వ్యక్తులు పడవేసిన ఘటన సోమల మండలంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ నడింపల్లి సమీపంలో శిశువును గుర్తించిన స్థానికులు సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స ఇచ్చిన తరువాత ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు చిన్నారిని అంబులెన్స్‌లో చిత్తూరు శిశు విహార్‌కు తరలించారు.
News November 4, 2025
చిత్తూరు: ఆలస్యంగా వస్తున్న టీచర్లు..!

చిత్తూరు జిల్లాలో సుమారు 100 మంది ప్రభుత్వ టీచర్లు స్కూళ్లకు ఆలస్యంగా వస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు సైతం గుర్తించారు. టీచర్లు ఆలస్యంగా రావడంపై వివరణ కోరామని DEO వరలక్ష్మి చెప్పారు. ఆలస్యానికి గల కారణాలు చెప్పాలని ఆదేశించారు. టీచర్లు సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం చేయకూడదని స్పష్టం చేశారు.
News November 4, 2025
చిత్తూరు: దరఖాస్తులతో రూ.10 లక్షల ఆదాయం

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని 56 పోస్టులకు గత నెల నోటిఫికేషన్ ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చినట్లు చిత్తూరు DMHO సుధారాణి తెలిపారు. దరఖాస్తుల ఫీజుతో తమ శాఖకు రూ.10.46 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.


