News August 16, 2024

19న శ్రీసిటీకి CM చంద్రబాబు రాక

image

సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 19న ఆయన శ్రీసిటీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పరిశీలించారు. భద్రతా విషయాలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో శ్రీసిటీ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

Similar News

News September 13, 2024

చిత్తూరు: ప్రమాదంలో మృతి చెందింది వీరే..!

image

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం(M) మొగిలి ఘాట్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు జిల్లా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదుగురి వివరాలు గుర్తించగా.. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. బల్లరాజు(సిద్దిపేట, తెలంగాణ), ఎ.విజయ(పాకాల మండలం కంబాలమెట్ట), మనోహర్(ఆర్టీసీ డ్రైవర్) ,బేబీ హన్సిక(యూపీ), సోను కుమార్(ఉత్తరప్రదేశ్) చనిపోయినట్లు గుర్తించారు.

News September 13, 2024

చిత్తూరు: రేపటి నుంచి స్వచ్ఛత హీ సేవ

image

జిల్లాలో రేపటి నుంచి అక్టోబర్ 1 వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా అవగాహన సదస్సులు, ర్యాలీలు, వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు. గ్రామాలలో శ్రమదానం చేయాలని సూచించారు. కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

News September 13, 2024

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆదిమూలం

image

లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో మధ్య చెన్నై అపోలో నుంచి ఆదిమూలం డిశ్ఛార్జి అయి ఇంటికి వచ్చారు. ఆయన పుత్తూరు నివాసానికి చేరుకున్నారని సమాచారం. ఆయన గన్‌మెన్, పీఏ సహా బంధుమిత్రులకు, పార్టీ శ్రేణులకు ఎవరికీ అనుమతి లేదని సమాచారం. బుధ, గురువారాల్లో TPT ఇంటెలిజెన్స్ పోలీసులు ఎమ్మెల్యేను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ గుండెకు స్టంట్ వేయించుకున్నానని రెండ్రోజుల్లో తానే వచ్చి కలుస్తానని ఆయన చెప్పారు.