News August 12, 2025
19న ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం

ఓయూ 84వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నారు. ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ వేడుకకు వర్సిటీ ఛాన్స్‌లర్ హోదాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్య అతిథిగా ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల బంగారు పతకాల గ్రహీతలు, 2023 నవంబర్ నుంచి ఈ నెల వరకు ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు పొందిన వారికి ప్రదానం చేయనున్నారు.
Similar News
News August 13, 2025
HYD: వానొచ్చినా.. వరదొచ్చినా.. మెట్రోనే బెస్ట్

నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏ రోడ్డెక్కినా ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు. HYDకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు. దీంతో మేమున్నామంటూ మెట్రో పేర్కొంది. వానొచ్చినా.. వరదొచ్చినా.. ప్రయాణికుల మీద చినుకుపడకుండా గమ్య స్థానాలకు చేర్చుతామని తెలిపింది. చింతలేకుండా ప్రయాణించాలని భరోసానిస్తోంది. ఫ్లడ్స్ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటోందని, సర్వీసులు పెంచాలని నగరవాసులు కోరుతున్నారు.
News August 13, 2025
HYDకు జల ప్రళయం తప్పదా?

చినుకు పడితే వణికే HYD ఈ 3 రోజులు జల ప్రళయం ఎదుర్కోక తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల 7 సెం.మీ నుంచి 10 సెం.మీ వాన కురిస్తే ముంపు ఏరియాలతో పాటు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇక నార్త్ HYDలో 20సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మొన్న నమోదైన 15.15 సెం.మీ వర్షపాతంతో కుత్బుల్లాపూర్ అతలాకుతలమైంది. ఇప్పుడేమో <<17390735>>20 సెం.మీ<<>> అంటుంటే నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
News August 13, 2025
HYD: SPTUలో డిప్లమా ఇన్ మ్యాజిక్‌లో దరఖాస్తుల ఆహ్వానం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లమా ఇన్ మ్యాజిక్ (ఇంద్రజాలం) కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత అయినవారు అర్హులని, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఈ కోర్సును ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నాంపల్లి ప్రాంగణంలో నిర్వహింపబడుతుందన్నారు. ఆసక్తి గలవారు 9059794553కు సంప్రదించాలన్నారు.