News November 17, 2025
19న నల్గొండలో జాబ్ మేళా

ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. పదో తరగతి, గ్రాడ్యుయట్, D/B/M- Pharmacy చదివిన వారు అర్హులని తెలిపారు.
Similar News
News November 17, 2025
కేయూ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించేందుకు కేయూ నూతన విద్యార్థి జేఏసీని నేతలు ప్రకటించారు. జేఏసీ ఛైర్మన్‌గా ఆరేగంటి నాగరాజ్, వైస్ ఛైర్మన్‌గా కేతపాక ప్రసాద్, కన్వీనర్‌గా కందికొండ తిరుపతి, కో-కన్వీనర్‌గా అల్లం విజయ్, ప్రధాన కార్యదర్శిగా బోస్కా నాగరాజ్, కార్యదర్శిగా జనగాం రాజారాం, కోశాధికారిగా రేగుల నరేశ్ నియమితులయ్యారు.

ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్‌లైన్‌లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.