News April 13, 2024
19న మంత్రి పెద్దిరెడ్డి నామినేషన్

పుంగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ కార్యాలయం శనివారం తెలిపింది. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News December 26, 2025
చిత్తూరు: ఉపాధి రికవరీ బకాయిలు రూ. 1.59 కోట్లు

చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ తనిఖీ రికవరీలో ఇంకా రూ. 1.59 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఐదేళ్లలో సోషల్ ఆడిట్లో రూ. 4.85 కోట్ల మేర అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీనిని రికవరీ చేయాలని ఆదేశించగా ఇప్పటివరకు రూ. 3.26 కోట్లను వసూలు చేశారు. రికవరీకి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
News December 25, 2025
క్రీస్తు లోక రక్షకుడు: చిత్తూరు కలెక్టర్

చిత్తూరులోని లక్ష్మీనగర్ కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీట్టీ మెమోరియల్ చర్చ్‌లో రేవ శామ్వేల్ ఆర్థర్ అధ్యక్షతన ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు కలెక్టర్ సుమిత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలసి హాజరయ్యారు. లోక రక్షకుడైన క్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. క్రీస్తు లోక రక్షకుడని, ఆయన జననం లోకానికి సమాధానమని తెలిపారు.
News December 25, 2025
పలమనేరు: వాట్సప్‌లోనే RTC బస్ టికెట్స్ బుకింగ్

APSRTC టికెట్ బుకింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని పలమనేరు ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ తెలిపారు. ఇకపై ఎవరైనా బస్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే కౌంటర్ల వద్ద నిలబడే అవసరం లేదన్నారు. 95523 00009 నంబర్ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


