News February 13, 2025

19న BRS విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని KCR ఆదేశం

image

19వ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కేసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్౨ను ఆదేశించారు. సమావేశానికి కావలసిన ఏర్పాట్లను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని కెసిఆర్ సూచించారు.19న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు.

Similar News

News February 14, 2025

రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

image

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్‌ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.

News February 14, 2025

బిచ్కుంద: బస్టాండ్ ఆవరణలో వ్యక్తి మృతి

image

బిచ్కుంద బస్టాండ్ ఆవరణలో పుల్కల్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించి చూడగా మద్యం సేవించి ఉన్న సమయంలో ఫిట్స్ వచ్చాయని స్థానికులు చెప్పినట్లు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 14, 2025

జగిత్యాల: బావిలో మృతదేహం.. అడ్రస్ లభ్యం  

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో మృతిచెందిన వ్యక్తి అడ్రసును పోలీసులు గురువారం మధ్యాహ్నం గుర్తించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన జక్కని సాయికుమార్ (30)గా గుర్తించినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. సాయికుమార్ తన అత్తగారి ఊరైన పోసానిపేట గ్రామానికి ఐదు రోజుల క్రితం వచ్చి వెళ్లాడు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు.

error: Content is protected !!