News July 17, 2024
19 నుంచి మిర్యాలగూడ స్టాప్ ఎత్తివేత

విశాఖ, చైన్నె, నారాయణాద్రి రైళ్లకు మిర్యాలగూడలో ఈనెల 19నుంచి స్టాప్ను ఎత్తివేస్తూ రైల్వే అధికారులు ఆదేశాలిచ్చారు. కోవిడ్ సమయంలో ఈ రైళ్లకు స్టాప్ ఎత్తివేయగా EX MP ఉత్తమ్, EX MLA భాస్కర్రావు మిర్యాలగూడలో రైళ్లను నిలపాలంటూ అధికారులకు విన్నవించారు. గత ఏడాది జులై నుంచి ఆయా రైళ్లు నిలిచేలా అనుమతించారు. ఆదేశాలిచ్చేటప్పుడే ఏడాది పాటు రైళ్లు నిలుపుతామని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఏడాది పూర్తయింది.
Similar News
News October 20, 2025
NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.

NLG: అమ్మో ఈ ఆలయాలకు వెళ్లాలంటేనే..

జిల్లాలో ఈజీ మనీ కోసం ట్రాన్స్ జెండర్లు వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పలు ఆలయాల వద్ద తిష్ట వేస్తున్న ట్రాన్స్జెండర్లు భక్తుల నుంచి అడ్డగోలుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరు(M) కోట మైసమ్మ, కనగల్(M) దర్వేశిపురం ఆలయాల వద్ద అమ్మవార్లకు మొక్కుబడులు చెల్లించేందుకు, కొత్త వాహనాలకు పూజలు చేసుకునేందుకు వచ్చిన భక్తుల వద్దకు గుంపులుగా చేరుకొని ట్రాన్స్జెండర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.