News February 6, 2025
19 నుంచి శ్రీకపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి శేషాచలం పర్వతాల్లో వెలసిన శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 15న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి వాహన సేవలు జరగనున్నాయి.
Similar News
News February 6, 2025
అన్నమయ్య: రెండవ శనివారం పాఠశాలలకు సెలవు లేదు
ఇటీవల వర్షాల కారణంగా సెలవులు ఇవ్వడం వల్ల పాఠశాల పని దినాలు 220 రోజులు కన్నా తక్కువ ఉన్నందున ఈనెల 8వ తేదీన రెండో శనివారం కూడా పాఠశాలలు పని దినంగా నిర్ణయించినట్లు డీఈవో బాలసుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి అన్నమయ్య జిల్లాలో రెండవ శనివారం పాఠశాలలకు సెలవు లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని డీఈవో సూచించారు.
News February 6, 2025
నీటి ఎద్దడిపై చిత్తూరు కలెక్టర్ సమీక్ష
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఈఓపీఆర్డీలతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. అధికారులు నీటి ఎద్దడి గ్రామాల వివరాలను తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
News February 6, 2025
ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో RRB, SSC బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 4నెలల ఉచిత శిక్షణ, బుక్ ఫండ్, ప్రతినెల స్టైఫండ్ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.