News September 18, 2024
19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో గోదావరి వద్ద నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం భద్రాచలం గోదావరిలో పటిష్ఠ బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.
Similar News
News December 3, 2025
నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా చేపట్టాలి: అ.కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను అధికారులు సజావుగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. బుధవారం తల్లాడ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్.. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థులు సమన్వయంతో అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
News December 3, 2025
స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పనిచేయాలి: సీపీ

ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలని సీపీ సునీల్ దత్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై బుధవారం ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.
News December 3, 2025
పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.


