News September 18, 2024

19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో గోదావరి వద్ద నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం భద్రాచలం గోదావరిలో పటిష్ఠ బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

Similar News

News November 28, 2024

KMM: ‘రైతు పండుగ నాటికి రైతు రుణమాఫీ పూర్తి’

image

సాంకేతిక కారణాలతో మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్మ ఖాతాల్లో జమ కాలేదని, దానిని మహబూబ్ నగర్‌లో నిర్వహించే రైతు పండుగ నాటికి క్లియర్ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ బియ్యాన్ని విదేశాల వారు కోరుకుంటున్నారని చెప్పారు.

News November 28, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం & భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో మంచినీటి సరఫరా బంద్ ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} ఖమ్మంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటన ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన

News November 28, 2024

పేదలందరికీ ఇళ్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం కూసుమంచిలో పర్యటించారు. గత ఎన్నికల్లో ఎంతో కష్టపడి తనను గెలిపించారని, నియోజవర్గ ప్రజలు ఆశలను వమ్ము చేయనని అన్నారు. త్వరలోనే  పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని.. ఇదంతా ప్రజలిచ్చిన దీవెనలు, ఆశీస్సులతోనే జరిగిందన్నారు.