News May 5, 2024

వడదెబ్బకు ఒక్కరోజే 19 మంది మృతి

image

TG: రాష్ట్రంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో వడదెబ్బతో ఏకంగా 19 మంది చనిపోయారు. ఇందులో వెల్గటూరుకు చెందిన MEO భూమయ్య(57) కూడా ఉన్నారు. జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, NZB, నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 22 జిల్లాల్లో వడగాలులు వీయగా.. హైదరాబాద్‌లో గాలిలో తేమ 15శాతానికి పడిపోయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News November 22, 2025

ఈ ఫుడ్స్‌తో విటమిన్ D3 లోపాలకు చెక్

image

ఎముకలను బలంగా ఉంచడం, రోగనిరోధకశక్తి పెంచడం, అలసటను తగ్గించడం, మానసిక స్థితిని మెరుగుపరచడంలో విటమిన్ D3 ముఖ్యపాత్ర పోషిస్తుంది. చేపలు, గుడ్డులోని పచ్చసొన, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, జున్ను, వెన్న, నెయ్యి తీసుకుంటే విటమిన్ D3 లోపానికి చెక్ పెట్టేయొచ్చు. సోయా, నారింజ రసం, తృణధాన్యాలలోనూ ఇది లభిస్తుంది. ఈ విటమిన్ పొందడానికి శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తలు తీసుకోవడం సులభమైన మార్గం.

News November 22, 2025

PHOTO GALLERY: భారతీయ కళా మహోత్సవం

image

HYD బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్‌ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. నేటి ప్రదర్శనల ఫొటోలు పైన చూడవచ్చు.

News November 22, 2025

SRHలోనే విధ్వంసకర బ్యాటర్లు

image

మినీ వేలం వేళ హిట్టర్లు ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌ను SRH విడిచిపెట్టనుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ యాజమాన్యం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. తాజాగా ఈ విధ్వంసకర వీరులిద్దరి ఫొటోలను SRH ట్వీట్ చేసింది. టాప్ ఆర్డర్‌లో హెడ్, మిడిల్ ఆర్డర్‌లో క్లాసెన్‌ ‘ఫైర్ పవర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ వీరిద్దరూ ఊచకోత కోయాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.