News August 9, 2024
విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912: భట్టి

TG: హైదరాబాద్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 హెల్ప్‌లైన్ నంబర్‌తో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. GHMC అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నగరంలో నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరాకు ఆదేశించినట్లు తెలిపారు. మారిన కాలానికి అనుగుణంగా విద్యుత్ సేవలు పెరగాలని అధికారులకు సూచించారు.
Similar News
News November 16, 2025
కార్మికులపై CBN వ్యాఖ్యలు దారుణం: రామకృష్ణ

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై CM చంద్రబాబు <<18299181>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నామని CPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. కార్మికులు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారనడం దారుణమన్నారు. ఆయన మాటలు తెలుగు జాతిని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్సెలార్ మిట్టల్‌కు క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు కానీ విశాఖ స్టీలుకు ఎందుకు అడగరని ప్రశ్నించారు.
News November 16, 2025
అది ఛేజ్ చేయగలిగే టార్గెటే: గంభీర్

టెస్టుల్లో ఆడాలంటే స్కిల్‌తో పాటు మెంటల్ టఫ్‌నెస్ ఉండాలని IND హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. SAతో తొలి టెస్టులో <<18303459>>ఓటమి<<>> అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘124 ఛేజబుల్ టార్గెటే. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్‌పై ఆడాలంటే టెక్నిక్, టెంపెరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. మేం అడిగిన పిచ్‌నే క్యూరేటర్ తయారు చేశారు. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
భారీ జీతంతో CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (SERC) 30 సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.1,38,652 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://serc.res.in/


