News June 20, 2024

వేడి కారణంగా ఢిల్లీలో 192మంది నిరాశ్రయుల మృతి

image

ఉత్తరాదిలో నిన్న మొన్నటి వరకు వేడిగాలుల ఉధృతి కొనసాగింది. ఆ కారణంగా ఢిల్లీలో ఈ నెల 11 నుంచి 19 మధ్యలో 192మంది నిరాశ్రయులు మ‌ృతిచెందారని ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ సంస్థ తెలిపింది. ఈ కాల పరిమితిలో ఇంతమంది చనిపోవడం ఇదే అత్యధికమని ఓ నివేదికలో వెల్లడించింది. ఢిల్లీలో గడచిన 72 గంటల్లో ఐదుగురు కన్నుమూయడం గమనార్హం. ఇక గత 24 గంటల్లోనే నోయిడాలో 14మంది వేడి కారణంగా చనిపోయారు.

Similar News

News October 23, 2025

మహిళలూ బండిపై ప్రయాణిస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఈ బిజీ ప్రపంచంలో మహిళలు కూడా నిత్యం వాహనాలు నడపడం తప్పనిసరైంది. అయితే ఈ సమయంలో ప్రమాదాలు నివారించడానికి కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బండి నడిపేటపుడు చీర కొంగు, చున్నీ ఎగరకుండా బిగించి కట్టుకోవాలి. లేదంటే చక్రాలకు శారీగార్డు ఏర్పాటు చేసుకోవాలి. హెల్మెట్ వాడటం తప్పనిసరి. పిల్లలతో ప్రయాణించేటపుడు టూ వీలర్​ బేబీ బెల్ట్​, ఛైల్డ్‌ క్యారియర్‌ వాడటం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది.

News October 23, 2025

సన్నధాన్యం: ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్

image

TG: సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు ₹500 బోనస్ ఇస్తోంది. అయితే బియ్యపు గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేర ఉంటేనే బోనస్ వస్తుంది. గ్రెయిన్ కాలిపర్ అనే మిషన్‌ ద్వారా గింజ పొడవు, వెడల్పు కొలుస్తారు. గింజ పొడవు 6mm, వెడల్పు 2mm కంటే తక్కువ ఉండాలి. పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5mm కంటే ఎక్కువ ఉండేవాటికి ప్రాధాన్యం ఇస్తారు. * రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 23, 2025

258 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. B.E./B.Tech/M.Tech పూర్తి చేసిన వారు అర్హులు. వారి గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 18-27 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఈ వారంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. వెబ్‌సైట్: https://www.mha.gov.in/