News January 11, 2025

193 ఏళ్ల క్రితం నీలవర్ణంలో సూర్యుడు.. కారణమిదే

image

1831లో ఓ విచిత్రం జరిగింది. ప్రపంచానికి సూర్యుడు నీలవర్ణంలో కనిపించాడు. దానికి కారణాన్ని స్కాట్లాండ్ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. రష్యా సమీపంలోని జవారిట్స్‌కీ అనే అగ్నిపర్వతం ఆ ఏడాది విస్ఫోటనం చెందిందని గుర్తించారు. దాన్నుంచి భారీగా వెలువడిన సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణాన్ని కమ్మేసిందని పేర్కొన్నారు. అగ్నిపర్వత విస్ఫోటనం భూ వాతావరణాన్ని పూర్తిగా మార్చడానికి భవిష్యత్తులోనూ ఛాన్స్ ఉందని హెచ్చరించారు.

Similar News

News January 11, 2025

దారుణం: అథ్లెట్‌పై 60మంది లైంగిక వేధింపులు

image

కేరళలో దారుణ ఘటన జరిగింది. అథ్లెట్‌గా ఉన్న ఓ బాలిక(18)పై ఐదేళ్ల పాటు 60మందికి పైగా మృగాళ్లు లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారు. శిశు సంక్షేమ కమిటీ ముందు ఆమె తాజాగా తన గోడును వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగుచూసింది. తనకు 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ ఇరుగు పొరుగు వ్యక్తులు, కోచ్‌లు, తోటి అథ్లెట్లు లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేసింది. 40మందిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.

News January 11, 2025

కార్చిచ్చుపై లాస్‌ ఏంజిలిస్ ప్రజల ప్రశ్నలు

image

లాస్ ఏంజిలిస్‌లో కార్చిచ్చు 11మంది మరణానికి, రూ.లక్షల కోట్ల నష్టానికి కారణమైంది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి మంటలు మొదలయ్యాయన్న కుట్ర కోణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దావానలానికి కారణమేంటో కనిపెట్టాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్వతంత్ర దర్యాప్తు చేయిస్తామని గవర్నర్ గవిన్ వారికి హామీ ఇచ్చారు.

News January 11, 2025

టీమ్ ఇండియాలో చిన్న ఆటగాళ్లను మాత్రమే తప్పిస్తారు: మంజ్రేకర్

image

టీమ్ ఇండియా సెలక్షన్ విధానాలపై వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించారు. ‘మన స్టార్ క్రికెటర్లను ఫామ్ లేకపోయినా తప్పించరు. చిన్న ఆటగాళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా తప్పిస్తారు. ఒకవేళ పెద్ద ఆటగాళ్లను తప్పించినా, ఆ విషయానికి తేనెపూసి గాయమనో, ఆటగాడే తప్పుకున్నాడనో చెబుతారు. ఇది తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. సూపర్ స్టార్ కల్చర్‌కి దారి తీస్తుంది. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు.