News January 27, 2025
1930కి సమాచారం ఇవ్వండి: ఏలూరు ఏఎస్పీ

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం జరిగింది. అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సుమారు 39 ఫిర్యాదులు వచ్చినట్లు ఏఎస్పీ చెప్పారు.ఫిర్యాదులపై సమీక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930కి సమాచారాన్ని అందించాలని కోరారు.
Similar News
News September 16, 2025
వెలిచాలలో మహిళా డిగ్రీ కళాశాల NSS క్యాంప్

రామడుగు మండలం వెలిచాలలో మహిళా డిగ్రీ కళాశాల NSS క్యాంప్ 6వ రోజుకు చేరింది. మంగళవారం NSS ఆఫీసర్ డా. ఈ.స్రవంతి ఆధ్వర్యంలో NSS వాలంటీర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. స్కూల్ విద్యార్థులలో క్రమశిక్షణ కార్యక్రమాలు, గ్రామంలో సర్వే నిర్వహించారు. అనంతరం KNR సైబర్ క్రైమ్ వారు హాజరై ఆన్లైన్ మోసాలను మహిళల భద్రతను గురించి వివరించారు.
News September 16, 2025
KNR: శిశు సంరక్షణ కేంద్రాల పరిశీలన

కరీంనగర్ జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని వాకాడే పరిశీలించారు. లోకల్ బాడీస్ జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆమె కమిటీ సభ్యులతో కలిసి ఈ కేంద్రాలను సందర్శించారు. వెంకట్ ఫౌండేషన్ బాల గోకులం, సంక్షేమ ట్రస్ట్ కపిల్ కుటీర్, ఓపెన్ షెల్టర్లలో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లల సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
News September 16, 2025
సీఎం సమీక్షలో ఏలూరు కలెక్టర్, ఎస్పీ హాజరు

అమరావతి సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని అభివృద్ధి, శాంతిభద్రతలపై చర్చించారు. ముఖ్యమంత్రి సూచనలను అమలు చేయడానికి సిద్ధమని జిల్లా అధికారులు తెలిపారు.