News January 27, 2025

1930కి సమాచారం ఇవ్వండి: ఏలూరు ఏఎస్పీ

image

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం జరిగింది. అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సుమారు 39 ఫిర్యాదులు వచ్చినట్లు ఏఎస్పీ చెప్పారు.ఫిర్యాదులపై సమీక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930కి సమాచారాన్ని అందించాలని కోరారు.

Similar News

News February 15, 2025

BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పులతడకగా ఉందని BRS MLC కవిత ఆరోపించారు. ఖమ్మంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ‘బీసీలకు 42శాతం కాదు, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టాలి. మతాలు, కులాల మధ్య గొడవలు పెట్టడమే బీజేపీ నేతల పని. జై భీమ్, జై బీసీ నినాదం ఒకచోటే ఉండాలి’ అని డిమాండ్ చేశారు.

News February 15, 2025

మహిళా క్రికెటర్‌కు హీరో శివ కార్తికేయన్ సాయం!

image

తాము కష్టాల్లో ఉన్నప్పుడు సినీ నటుడు శివ కార్తికేయన్ చేసిన సాయాన్ని భారత మహిళా క్రికెటర్ ఎస్ సంజన గుర్తు చేసుకున్నారు. ‘2018 వయనాడ్ వరదల్లో ఇళ్లు కోల్పోయాం. నా ట్రోఫీలు, క్రికెట్ కిట్ కొట్టుకుపోయాయి. అప్పుడు శివ కార్తికేయన్ కాల్ చేసి హెల్ప్ కావాలా అని అడిగారు. కొత్త స్పైక్స్ కావాలని అడిగిన వారంలోనే అవి నా చెంతకు చేరాయి. అప్పుడు నా చుట్టూ ఎంత మంది మద్దతుదారులున్నారో తెలిసింది’ అని చెప్పుకొచ్చారు.

News February 15, 2025

కుంభమేళా సమయం పొడిగించండి: అఖిలేశ్

image

ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా మహాకుంభమేళాను 75 రోజులకు పొడిగించాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు. గతంలో ఒకసారి కుంభమేళా 75 రోజులపాటు జరిగిందని తెలిపారు. రద్దీ దృష్ట్యా 60 సంవత్సరాల పైబడిన వారు కుంభమేళాకు రాలేకపోతున్నారన్నారు. ఇప్పటివరకూ 60కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే 50కోట్ల మంది వచ్చినట్లు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

error: Content is protected !!