News October 29, 2025
1,937 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు: మంత్రి నాదెండ్ల

ఏలూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి, తుఫాను బాధితులైన 1,937 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతీ కేంద్రంలో భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, 318 మంది గర్భిణులను పీహెచ్‌సీల్లోకి తరలించామని ఆయన మంగళవారం రాత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
Similar News
News October 29, 2025
NLG: రెచ్చిపోతున్న కుక్కలు.. పట్టించుకోరే..!

నల్గొండ జిల్లాలో కుక్కల దాడి ఘటనలు జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప తర్వాత పట్టించుకోవడం లేదని పట్టణ, పల్లె ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అటు మున్సిపల్ సిబ్బంది గానీ, ఇటు గ్రామపంచాయతీ సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా నల్గొండ నాలుగో వార్డులో 11 మందిపై కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి.
News October 29, 2025
‘మొంథా’ విజృంభిస్తోంది.. సెలవులు ఇవ్వండి!

మొంథా తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, నంద్యాలతో పాటు పలు జిల్లాల్లో నిన్నటి నుంచే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ సెలవు ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది. భారీ వర్షాల ముప్పు ఉండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా తుఫాన్ తీవ్రత తగ్గే వరకూ సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
News October 29, 2025
పల్నాడు జిల్లాకు ఇక ఇవి లేనట్టేనా.?

పల్నాడు జిల్లాకు ఆయు పట్టుగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గాన్ని అమరావతి జిల్లాలోకి మార్చాలనే ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం సీఎంతో చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గంలోని 5 మండలాలు అమరావతి జిల్లా పరిధిలోకి రానున్నాయి. దీంతో పల్నాడు జిల్లా నుంచి చారిత్రాత్మక అమరావతి టెంపుల్, ధ్యాన బుద్ధ విగ్రహం, పులిచింతల ప్రాజెక్టు అమరావతి జిల్లా పరిధిలోనికి వెళ్లి బలమైన జిల్లాగా ఏర్పడనుంది.


