News October 7, 2025

DGEMEలో 194 పోస్టులు

image

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(DGEME)194 గ్రూప్ సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: indianarmy.nic.in

Similar News

News October 7, 2025

నేడు చంద్రబాబుతో TTDP నేతల భేటీ

image

తెలంగాణ టీడీపీ నేతలకు అమరావతి నుంచి పిలుపు వచ్చింది. ఈ సాయంత్రం టీటీడీపీ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. అటు జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ ఉంటుందా? లేదంటే బీజేపీకి మద్దతు ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

News October 7, 2025

ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో 20 ఉద్యోగాలు

image

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ -బీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. వెబ్‌సైట్: https://www.prl.res.in/

News October 7, 2025

బంగారం ధరలు.. ALL TIME RECORD

image

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,250 పెరిగి తొలిసారి రూ.1,22,020కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,150 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,11,850 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.100 పెరిగి రూ.1,67,100కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.