News September 17, 2025

1948 SEP 17 తర్వాత HYDలో ఏం జరిగింది?

image

‘ఆపరేషన్ పోలో’ తర్వాత HYD సంస్థానాదీశుడు నిజాం భారత ప్రభుత్వానికి తలొగ్గారు. ‘గోల్కొండ ఖిలా కింద ఘోరి గడతాం’అని ఎవరిపై ప్రజలు తిరగబడ్డారో ఆయనను ప్రభుత్వం తెలంగాణకు రాజ్ ప్రముఖ్‌గా నియమించి గౌరవించింది. ఆ తర్వాత ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించింది. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని పాకిస్థాన్‌కు పంపింది. 1952లో జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రజలను పీడించిన ప్రభువుల కథ సుఖాంతం అయింది.

Similar News

News September 17, 2025

HYD: రోడ్లపై చెత్త వేస్తే ఒక్కో రకంగా జరిమానా

image

గ్రేటర్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని అనేక చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా.. ఫలితం లేకుండా పోతోంది. గ్రేటర్ పరిధిలో రోడ్లపై చెత్త వేస్తే రూ.1,000 జరిమానా వేస్తామని బోర్డులపై ఉండగా, అదే బోడుప్పల్ కార్పొరేషన్లలో రూ.25,000 జరిమాన వేస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ కంటే కార్పొరేషన్లలోనే అధికంగా జరిమానా ఉన్నట్లు తెలుస్తోంది.

News September 17, 2025

ADB: గండర గండడు కొమురం భీముడే మన బిడ్డ..!

image

తెలంగాణ చరిత్రలో వీరత్వానికి, పోరాటానికి ప్రతీకగా నిలిచారు కొమురం భీమ్. 1901లో జన్మించిన ఈ గిరిజన యోధుడు, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడారు. “జల్, జంగల్, జమీన్” అనే నినాదంతో గిరిజనులను ఏకం చేసి, తమ వనరులపై ఉన్న హక్కులను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ​1940లో, జోడేఘాట్ వద్ద నిజాం పోలీసులతో జరిగిన పోరాటంలో కొమురం భీమ్ అమరుడయ్యారు. ఆయన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శం.

News September 17, 2025

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 22 నుంచి జరుగనున్న ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇంటర్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.