News February 6, 2025

197 మంది బాలకార్మికులను గుర్తించాం: SRPT ఎస్పీ

image

 జిల్లాలో జనవరి నెలలో నెలరోజుల పాటు జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ పగడ్బందీగా నిర్వహించామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిరాధరణకు, వెట్టిచాకిరీ గురవుతున్న 197 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సంరక్షులకు అప్పగించడం జరిగిందన్నారు. బాలలను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరించారు. 

Similar News

News February 16, 2026

విశాఖలో ‘షాడో మంత్రి’(1/3)

image

విభజిత విశాఖ జిల్లాలో మంత్రి పదవి లేకపోయినా ఆ సీనియర్ ఎమ్మెల్యే మీసం మెలేస్తే.. మంత్రి కన్నా పవర్‌ఫుల్‌గా పనులు అవుతున్నాయనే చర్చ సర్వత్రా నడుస్తోంది. అధికారుల బదిలీలు, బార్ టెండర్లు, లిక్కర్ సిండికేట్లు, భూముల ఫైళ్లలో ఆయన చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ‘షాడో మంత్రి’గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

News February 16, 2026

విశాఖ హార్బర్ జోన్ ఏసీపీ హఠాత్ బదిలీ(2/3)

image

ఇటీవల విశాఖపట్నం హార్బర్ జోన్ ఏసీపీగా సీహెచ్ వివేకానంద బాధ్యతలు స్వీకరించారు. అయితే కొన్ని గంటల్లోనే తిరిగి శ్రీకాకుళం డీఎస్పీగా బదిలీ చేస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనో మరో అధికారిని ఆ స్థానంలో నియమించారు. ఈ హఠాత్ బదిలీ వెనుక ఆ ఎమ్మెల్యే(షాడో మంత్రి) కీలక పాత్ర పోషించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

News February 16, 2026

జామలో కాయకుళ్లు తెగులు నివారణకు సూచనలు

image

జామ తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లపై ఈ తెగులు ప్రభావం కనిపిస్తుంది. కాయకుళ్లు సోకిన జామ పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు పడి కనిపిస్తాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3 నుంచి 4 రోజుల్లో పండు కుళ్లిపోతుంది. దీని నివారణకు కాయలు ఏర్పడే సమయంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.