News December 23, 2025
1972లో గోపురం పునర్నిర్మాణం…!

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ విమాన గోపురం పునర్నిర్మాణం 1972లో జరిగింది. 2018లో టీటీడీ బోర్డు బంగారు తాపడం పనులు చేయాలని నిర్ణయించింది. 100 కిలోల బంగారు, 4300 కిలోల రాగి తో పనులు చేయడానికి తీర్మానించారు. 2023 మే 21 నుంచి 25 వరకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. అప్పట్లోనే బంగారు మాయమైందని హిందూ సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి.
Similar News
News December 27, 2025
కమ్యూనిస్టు ఉద్యమాలకు పురిటి గడ్డగా నల్లగొండ జిల్లా

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం సీపీఐ జిల్లాలో దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. భూమి హక్కులు, సాగునీరు, ఉపాధి, గిట్టుబాటు ధరలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన పార్టీ నిర్మాణంతో ప్రజల మధ్య పని చేస్తూ సమ సమాజ సాధనే లక్ష్యంగా సీపీఐ ముందుకు సాగుతోంది.
News December 27, 2025
బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానం: కలెక్టర్

గంజాయి ఉత్పత్తుల నియంత్రణ, మహిళలపై నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నుంచి బాపట్ల జిల్లా ఎస్పీ ప్రశంసలు అందుకున్నారని అభినందించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
News December 27, 2025
గంజాయి వినియోగంపై ఉక్కుపాదం: ఎస్పీ

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. గంజాయి వినియోగించే 71 ప్రాంతాలను గుర్తించామని, ‘ఈగల్ టీం’ సమర్థంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు, జిల్లాలో గంజాయి ఉత్పత్తులను పూర్తిగా అరికట్టామన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, నిఘా ముమ్మరం చేశామని ఆయన వివరించారు.


