News August 21, 2024

1992-అజ్మీర్ సెక్స్ స్కాండల్ ఏంటంటే…

image

32 ఏళ్ల నాటి కేసులో ఆరుగురు అత్యాచార నిందితులకు ఎట్టకేలకు కోర్టు శిక్ష విధించింది. 1992లో అజ్మీర్‌లో 100మందికి పైగా బాలికల్ని ఓ ముఠా రేప్ చేసిన దారుణ ఘటన అది. బాలికలతో స్నేహం చేసిన నిందితులు, వారిని అశ్లీలంగా ఫొటోలు తీసి బెదిరించి అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. కేసులో మొత్తం 18మంది నిందితులుండగా ప్రస్తుతం ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. దీన్నే అజ్మీర్ సెక్స్ స్కాండల్‌గా వ్యవహరిస్తారు.

Similar News

News November 23, 2025

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం: MHBD కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లాలోని 482 పంచాయతీలు, 4,110 వార్డులకు 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించి ఎస్‌ఈసీకి పంపినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మొదటి దశలో 155 పంచాయతీలు, రెండో దశలో 158, మూడో దశలో 169 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

News November 23, 2025

URDIPలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

image

CSIR-యూనిట్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్(URDIP) 3ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. కెమికల్/ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో పీజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత గల వారు డిసెంబర్ 16న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://urdip.res.in/

News November 23, 2025

భూమిలో కర్బన నిల్వల స్థాయి టెస్టింగ్ ఇలా..

image

ఒక చెంచాతో 1 గ్రాము మట్టిని, 2ml పొటాషియం డైక్రోమేట్‌తో పాటు 2ml సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఒక సీసాలో పోసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ సీసాలో నీటిని పోయాలి. ఆ ద్రావణం మారిన రంగును బట్టి భూమిలో కర్బన శాతం తెలుసుకోవచ్చు. ☛ నారింజ/పసుపు రంగు – కర్బన స్థాయి తక్కువ ☛ ముదురు గోధుమ/ నలుపు రంగు – కర్బన స్థాయి మధ్యస్థం ☛ ఆకు పచ్చ/ నీలి రంగు – కర్బన స్థాయి ఎక్కువ.