News August 3, 2024
INDలో 1GB డేటా రూ.10లోపే.. అక్కడ రూ.2వేలు!

ఇండియాలో ఓ కప్పు చాయ్ ధర కంటే కూడా 1GB డేటా చీప్‌గా వస్తోందని DoT India Xలో షేర్ చేసింది. ఈక్రమంలో ఇతర దేశాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. విజువల్ క్యాపిటలిస్ట్ నివేదిక ప్రకారం.. ఇండియాలో రూ.6.5కు 1GB డేటా వస్తే ఇజ్రాయెల్‌లో రూ.8, కిర్గిస్థాన్‌లో రూ.15.3, ఇటలీలో రూ. 31.38 చెల్లించాలి. అత్యధికంగా తూర్పు ఆఫ్రికాలోని మలావిలో 1GB డేటా కోసం రూ.2వేలు వెచ్చించాల్సిందే. USAలో రూ.500 ఖర్చు పెట్టాలి.
Similar News
News December 9, 2025
NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)వరంగల్‌లో 3పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, B.Sc( Food Tech), MSc( Food Tech), BA/BSc(సైకాలజీ)లేదా MA/MSc(సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST, PWBDలకు రూ.300. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/
News December 9, 2025
సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులిచ్చింది. 1983 ఏప్రిల్‌లో ఇండియన్ సిటిజన్‌షిప్ రావడానికి మూడేళ్ల ముందే ఎలక్టోరల్ రోల్‌లో పేరు నమోదైనట్టు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 2026, జనవరి 6వ తేదీన ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని స్పెషల్ జడ్జి జస్టిస్ విశాల్ గోనె తెలిపారు. ఢిల్లీ పోలీసులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.
News December 9, 2025
మెటాకు షాక్.. 4 ఏళ్లలో $70 బిలియన్లు హాంఫట్

VR హెడ్ సెట్స్, స్మార్ట్ గ్లాసెస్‌తో గేమింగ్ కమ్యూనిటీకి చేరువకావాలనుకున్న మెటా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రియాల్టీ ల్యాబ్స్ బడ్జెట్‌లో 30% కోత విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జనవరిలో లేఆఫ్స్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ పెరిగే వరకు MR గ్లాసెస్ లాంచ్‌ను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది.


