News January 31, 2025

2న ఒంగోలులో ఆరామ క్షేత్రం ప్రారంభం

image

రంగారాయుడు చెరువు వద్ద ఒంగోలు నగర భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆరామ క్షేత్రాన్ని నిర్మించారు. దీనిని ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు పద్మశాలి సంఘ నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందరూ పాల్గొనాలని కోరారు.

Similar News

News April 24, 2025

ఒంగోలు: నోటిఫికేషన్ విడుదల

image

ఏపీలో నిన్న టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు IIITలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 24, 2025

రాష్ట్రంలో చివరి స్థానంలో ప్రకాశం జిల్లా

image

ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్‌లో 3,668 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. 547 మంది పాస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. 14.9 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా 26వ స్థానంలో నిలిచింది. అలాగే ఓపెన్ టెన్త్‌లో 1,184 మంది పరీక్షలు రాస్తే.. 88 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 7.4 శాతంతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది.

News April 24, 2025

పొదిలి: రోడ్డుపై మద్యం లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

image

పొదిలి మండలం సలకనూతల వద్ద మార్కాపురం నుంచి దర్శికి మద్యం లోడ్‌తో వెళుతున్న వాహనం బుధవారం ప్రమాదానికి గురై రోడ్డుపై బొల్తాపడింది. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడగా.. మద్యం ప్రియులు వాటి కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.

error: Content is protected !!