News January 31, 2025

2న ఒంగోలులో ఆరామ క్షేత్రం ప్రారంభం

image

రంగారాయుడు చెరువు వద్ద ఒంగోలు నగర భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆరామ క్షేత్రాన్ని నిర్మించారు. దీనిని ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు పద్మశాలి సంఘ నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందరూ పాల్గొనాలని కోరారు.

Similar News

News February 14, 2025

రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసి మృతి

image

పల్నాడు జిల్లా శావల్యాపురంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీ కొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుడు పెద్దారవీడుకు చెందిన రమణగా గుర్తించారు. గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాకు వస్తుండగా.. శావల్యాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News February 14, 2025

ఒంగోలు: వీడియో కాన్ఫరెన్స్‌లో మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత మొదటిసారి ముఖ్య నాయకులు, అభిమానులతో మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. వారంతా ఎంపీ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ఒంగోలుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఘన శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

News February 13, 2025

చీమకుర్తి: ఫైరింగ్ సాధన ప్రక్రియలో జిల్లా ఎస్పీ

image

ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా చీమకుర్తి నందు గల జిల్లా ఫైరింగ్ రేంజ్‌లో పోలీసు అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ సందర్శించి అక్కడ చేస్తున్న ఫైరింగ్ ప్రక్రియ గురించి అధికారులకు పలు సూచనలు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అధికారులలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు.

error: Content is protected !!