News September 4, 2024

2వ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది: కలెక్టర్

image

భద్రాచలం వద్ద గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. వరద ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి ప్రాణనష్టానికి ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పునరావాస, వైద్య శిబిరాల్లో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు ఉండాలన్నారు. ఫిర్యాదులకు తావు లేకుండా పనిచేయాలన్నారు.

Similar News

News December 9, 2025

ప.గో జిల్లా మొత్తం 8 పరీక్షా కేంద్రాలు

image

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం 5, నరసాపురం 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

News December 9, 2025

‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

image

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్‌లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్‌ సంజీవ్‌లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.

News December 9, 2025

ఆచంటలో ఈనెల 10 జాబ్ మేళా..!

image

ఈనెల 10న ఆచంట ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్ తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. ప్రముఖ కంపెనీల్లో 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 18-35 సంవత్సరాల వయసు, పదో తరగతి ఆపై చదివినవారు అర్హులన్నారు.