News September 4, 2024
2వ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది: కలెక్టర్
భద్రాచలం వద్ద గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. వరద ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి ప్రాణనష్టానికి ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పునరావాస, వైద్య శిబిరాల్లో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు ఉండాలన్నారు. ఫిర్యాదులకు తావు లేకుండా పనిచేయాలన్నారు.
Similar News
News September 14, 2024
భీమవరంలో తల్లిదండ్రులను మోసం చేసిన కొడుకు
తమ కొడుకే తమను మోసం చేశాడని భీమవరం నాచువారి సెంటర్‌కు చెందిన డోకల నాగన్న- అప్పాయమ్మ దంపతులు వాపోతున్నారు. బాధితుల వివరాల ప్రకారం.. సెంటర్లో తమకు ఉన్న సెంటున్నర స్థలంలో చిన్నపాక వేసుకుని పింఛన్ నగదుతో జీవనం సాగిస్తున్నారు. కాగా ఆ స్థలాన్ని వారి చిన్న కొడుకు సోమేశ్వరరావు బలవంతంగా రాయించుకొని వేరే వ్యక్తులకు అమ్మేశాడు. దీంతో వారు ఖాళీ చేయించడంతో రోడ్డునపడ్డారు. అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు.
News September 14, 2024
ప.గో.: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి ఆరేళ్ల జైలు
ప.గో. జిల్లా ఆకివీడుకు చెందిన 12 ఏళ్ల బాలికపై మాదివాడకు చెందిన మద్దా సుందర్ సింగ్ 2017లో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ముద్దాయికి న్యాయమూర్తి సోమశేఖర్ శుక్రవారం ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ప్రస్తుత ఎస్సై నాగరాజు తెలిపారు.
News September 14, 2024
చింతలపూడి: ‘ఉపాధి హామీ పనులు ప్రారంభించండి’
ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్విను చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని కోరారు. అనంతరం ఉపాధి పనుల వివరాలను కలెక్టర్‌కు సమర్పించారు. గ్రామాల్లో ప్రజలు వలస వెళ్లకుండా ఉపాధి హామీ అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధులు కేటాయించాలని కోరారు.