News July 7, 2024
2వ రోజు 231 మంది సర్టిఫికెట్ వెరీఫికేషన్ పూర్తి

ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్లో ప్రవేశించేందుకు ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా 2వ రోజు ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ లో సర్టిఫికెట్ వేరిఫికేషన్ ప్రక్రియ కొనసాగింది. రెండవ రోజు 280 మంది అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోగా 231మంది హాజరై సర్టిఫికెట్ వేరిఫికేషన్ పూర్తి చేసుకున్నారని కోఆర్డినేటర్ వీరస్వామి తెలిపారు
Similar News
News September 19, 2025
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్కు పదోన్నతి

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
News September 19, 2025
క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.
News September 19, 2025
తలమడుగు: కలప అక్రమ రవాణా

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాపూర్ సమీపంలోని MS గార్డెన్లో సిబ్బంది తనిఖీలు చేశారు. రూ.84 వేల విలువైన టేకు కలప దొరికినట్లు చెప్పారు. కలపను జప్తు చేసి యజమాని మొహమ్మద్ మూసా, లక్షణ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.