News January 31, 2025

2న ఒంగోలులో ఆరామ క్షేత్రం ప్రారంభం

image

రంగారాయుడు చెరువు వద్ద ఒంగోలు నగర భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆరామ క్షేత్రాన్ని నిర్మించారు. దీనిని ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు పద్మశాలి సంఘ నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందరూ పాల్గొనాలని కోరారు.

Similar News

News February 1, 2025

సంతనూతలపాడు: మహిళలకు ఉచిత కంప్యూటర్ కోర్స్ 

image

సంతనూతలపాడు మండలం ఏండ్లూర్ వద్ద మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ కోర్స్ శిక్షణ తరగతులు ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జే.రవితేజ యాదవ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 15 నుంచి 45 సంవత్సరాలు లోపు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  

News February 1, 2025

దొనకొండ: సచివాలయ ఉద్యోగిపై దాడి చేసి పెన్షన్ నగదు చోరీ

image

దొనకొండ మండలం పెద్దన్నపాలెం వెల్ఫేర్ అసిస్టెంట్ వీరం రంగారెడ్డి దగ్గర రూ.2,64,000 పెన్షన్ నగదును గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. వెల్ఫేర్ అసిస్టెంట్ సొంతూరు చందవరం నుంచి పెద్దన్నపాలెంకు పింఛన్ పంపిణీకి వస్తుండగా బాధాపురం సమీపంలో బండి ఆపి ఉద్యోగిని కొట్టి నగదును తీసుకెళ్లారన్నారు. వెంటనే బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News January 31, 2025

సంతనూతలపాడులో అగ్ని ప్రమాదం

image

సంతనూతలపాడు మండలం గొర్ల మిట్టలో శుక్రవారం మద్దినేని సుబ్బారావు, మద్దినేని లక్ష్మీనారాయణ అనే రైతులకు చెందిన పొగాకు బేరన్లకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మేరకు సుమారు పది లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. పొగాకు, కర్ర టైర్లు, కాలిపోయి బారెన్ దెబ్బతిన్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.