News December 10, 2025

2వేల మంది పోలీసులతో ఎన్నికల బందోబస్త్: వరంగల్ సీపీ

image

రేపు జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా 2వేల మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇందులో డీసీపీలు ముగ్గురు, అదనపు డీసీపీలు 11 మంది, 13 మంది ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 13, 2025

ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు.. ఏర్పాట్లపై SEC ఆరా

image

APలోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పదవీకాలం ముగుస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ముందస్తు కార్యక్రమాలపై SEC నీలం సాహ్ని ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సన్నాహాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం మార్చితో, సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. కాగా TGలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

News December 13, 2025

ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

image

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.

News December 13, 2025

కర్నూలు జిల్లాలో 8,781 కేసులు నమోదు: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 11 వరకు 8,787 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే ఒక నెల జైలుశిక్ష కూడా విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేసినట్లు ఆయన చెప్పారు.