News December 31, 2025
2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ : కలెక్టర్

జనవరి 2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలోనూ సంబంధిత గ్రామాల్లోనూ కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News January 9, 2026
నెల్లూరు జిల్లాలో రూ.6675 కోట్లతో పవర్ ప్లాంట్

నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు IFFCO kisan SEZలో టాటా సంస్థ 6,675 కోట్లతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమను కేటాయించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా పురోగతి లేని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమల రాకతో యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
News January 9, 2026
NLR: ఒక్క బండితో అక్రమాలు ఆగేది ఎలా?

నెల్లూరు జిల్లాలో 210క్వారీలు ఉండగా 111గనుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు అనధికారికంగా ఖనిజాన్ని తవ్వేస్తున్నారు. కనీసం 4మండలాలకు ఓ పర్యవేక్షణ అధికారి ఉంటేనే వీటిపై ఫోకస్ చేయవచ్చు. ప్రస్తుతం జిల్లాలో ఆరుగురే ఉండగా.. తనిఖీలకు వెళ్లడానికి ఒకే ఒక వాహనం ఉంది. మైనింగ్ డిప్యూటీ డెరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉండగా గూడూరు AD శ్రీనివాసరావు ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. ఇలాగైతే అక్రమాలను ఎలా అడ్డుకోగలరు?
News January 9, 2026
నెల్లూరు: ఒక్కో తాటాకు రూ.10

భోగి రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మంటలు వేస్తుంటారు. పల్లెటూర్లో అయితే అడవికి వెళ్లి ఏదో ఒక ఆకు కొట్టుకు వచ్చి మంటలు వేస్తున్నారు. పట్టణాల్లో అలా వేయడం కుదరదు. దీన్నే కొందరు పల్లెటూరు వాసులు క్యాష్ చేసుకుంటున్నారు. తాటాకులను నెల్లూరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కో తాటి మట్ట రూ.10లకు, కట్ట రూ.80లకు అమ్ముతున్నారు. ఆకులు కొట్టే కూలీలు, వాటిని అమ్మే వారికి డబ్బులు సమకూరుతున్నాయి.


