News December 13, 2025
2వ విడతలో 172 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు

సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 182 గ్రామ పంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 172గ్రామ పంచాయతీలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు Way2Newsను చూస్తూ ఉండండి.
Similar News
News December 13, 2025
నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జోహార్ నవోదయ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఆరో తరగతి ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,469 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 4,548 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు.
News December 13, 2025
ఫేక్ డొనేషన్లతో క్లెయిమ్స్.. వారికి IT శాఖ హెచ్చరికలు

డొనేషన్ల పేరుతో బోగస్ క్లెయిమ్స్ చేసుకుంటున్న వారిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) దృష్టిపెట్టింది. చర్యలు తీసుకునే ముందు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. స్వచ్ఛందంగా తమ ఆదాయపన్ను రిటర్నులను విత్ డ్రా చేసుకోవాలని, ITRలను అప్డేట్ చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు SMSలు, ఈమెయిల్స్ ద్వారా సమాచారమిస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులను రివైజ్ చేసినట్లు చెబుతోంది.
News December 13, 2025
చిత్తూరు: ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ ఫెస్ట్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ వెల్లడించారు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు, అనంతరం 20న జిల్లాస్థాయి కెరీర్ ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ రంగాలు, విభాగాల్లో ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.


